నిర్లక్ష్యానికి గురైన పూర్ణపాడు-లాబేసు వంతెన నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని కురుపాం ఎమ్మెల్యే, విప్ తోయక జగదీశ్వరి కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం నియోజకవర్గం సమస్యలు పై ఎమ్మెల్యే గళమెత్తారు. ఈ వంతెన పూర్తయితే కొమరాడ, కురుపాం ప్రజలకు రవాణా కష్టాలు తప్పుతాయన్నారు. డోలీ మోతలు కూడా ఉండవని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బ్లడ్‌బ్యాంక్ ఏర్పాటు చేయాలని కోరారు.