బొండపల్లి: సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన మంత్రి
బొండపల్లి మండలంలో ఇద్దరు వ్యక్తులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు ఆదివారం అందజేశారు. మరువాడ గ్రామానికి చెందిన వెల్దుర్తి సత్యం కు రూ. 2. 21 లక్షలు అలాగే గట్టుపల్లి గ్రామానికి చెందిన గుల్లిపల్లి నరేష్ నవ్య దంపతులకు రూ. 2. 28 లక్షలు చొప్పున సీఎం సహాయ నిధి చెక్కులను ప్రభుత్వం ఇటీవల జారీ చేసింది. కాగా మంత్రి కొండపల్లి ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.