వసంత - లక్కిడాం మధ్య ప్రధాన రహదారికి ఇరువైపులా తుప్పలు బాగా పెరిగిపోవడంతో వాటిని తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. తుప్పలు పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కానరాక పలువురు ప్రమాదాల బారిన పడినట్లు స్థానికులు, వాహనదారులు తెలిపారు. ఈ రహదారిలో నిత్యం ఆర్టీసీ బస్సులు తిరుగుతున్న రహదారి కిక్కిరిసిన మలుపులు ఉండటంతో సంబంధిత అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.