విమర్శలు చేసేటప్పుడు అర్థవంతంగా సాహేతికంగా ఉండాలని రాష్ట్ర టిడిపి కార్యదర్శి గోపాలరాజు అన్నారు. గజపతినగరం టిడిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య మంత్రి శ్రీనివాస్ పై చేసిన విమర్శలు సరికాదని మండిపడ్డారు. మంత్రి కుటుంబం 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని గుర్తు చేశారు. మంత్రి శ్రీనివాస్ విద్యావంతుడు, రాష్ట్ర సమకాలీన అంశాలపై అవగాహన కలిగిన వాడని అన్నారు.