రేపు విజయనగరం జిల్లాకు వస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున పిలుపునిచ్చారు. సీఎం పర్యటన సాగే గంగచోళ్లపెంట, పురిటిపెంట గ్రామాల్లో ఆయన శుక్రవారం పరిశీలించారు. "గుంతలు రహిత రహదారులు" కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు రూ. 826 కోట్లతో చేపట్టనున్న రహదారుల మరమ్మతు పనులకు సీఎం శనివారం జిల్లా నుంచే శ్రీకారం చుట్టనున్నారని తెలిపారు.