భారీ వర్షాలు, తుఫానుల కారణంగా విజయవాడ నగరంలోని సింగ్ నగర్, అంబాపురం కొట్టు సెంటర్, బాంబే కాలనీతో పాటుగా మరెన్నో ప్రాంతాలు ముంపుకు గురై జన జీవనం అతలాకుతలం అయింది. మీడియా మాధ్యమాల ద్వారా ప్రసార సాధనాల ద్వారా విషయాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకున్న నందిగామ పట్టణంలోని. వి. ఆర్ కాలేజీ పూర్వ విద్యార్థుల బృందం ఆధ్వర్యంలో ఆదివారం 200 కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు.