ఉదయగిరిలో ట్రాఫిక్ సమస్యతో ప్రజలు విసుగెత్తిపోతున్నారు. రాత్రి వేళల్లో విజయవాడ, హైదరాబాద్, నెల్లూరు, చెన్నై, బెంగళూరు బస్సులు ఒకేసారి వచ్చి సెంటర్లో ఆగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ఒక్కటే ప్రధాన రోడ్డు ఉండడం ఆ రోడ్డులో సగం వరకు బస్సులే ఆగడంతో ఎదురుగా వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నప్పటికీ అధికారుల్లో ఉలుకు పలుకు లేదు.