ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని వరికుంటపాడు, ఉదయగిరి, జలదంకి, కలిగిరి మండలాల్లో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. కొన్ని మండలాల్లో మధ్యాహ్నం నుంచి వర్షం మొదలయితే మరికొన్ని మండలాల్లో ఉదయం నుంచే ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో చిరు వ్యాపారస్తులు, విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటికి రాకుండా అప్రమత్తంగా ఉండాలి.