ఉదయగిరి పట్టణంలోని బీసీ కాలనీ సమీపంలో గల శ్రీ సంతాన లక్ష్మి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నాలుగవ రోజు ఆదివారం సంతాన లక్ష్మి అమ్మవారు వారాహి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భారీగా వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు వారాహి అవతారం యొక్క విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు లోకా ప్రసాద్ శర్మ వివరించారు. దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.