కృష్ణపట్నం పోర్ట్ లో ఎమ్మెల్యే సోమిరెడ్డి వ్యవహరించిన తీరు గర్హనీయమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు నగరంలోని మాజీ మంత్రి క్యాంప్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు యథేచ్ఛగా ప్రజల ఆస్తిని దోచేస్తున్నారని, అమ్మేస్తున్నారని, తమ అనుయాయులకు ప్రభుత్వ పెద్దలు వాటిని కట్టబెడుతున్నారన్నారు.