నెల్లూరు జిల్లాలో తుఫాను (మాండుస్)ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మనుబోలు మండలంలోని వెంకన్న పాలెం గ్రామంలో భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మండలాల వారీగా నష్టపోయిన ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి వివరాలను, అంచనాలను తయారు చేయిస్తున్నామని, జిల్లా రైతాంగానికి పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నెట్ క్రాఫ్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్ మరియు సర్పంచ్ పెంచలమ్మ , కిరణ్ కుమార్ రెడ్డి , అడపాల చెంచురెడ్డి , మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు.