మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామ ప్రభుత్వ ఎంపీపీ స్కూలులో బుధవారం విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను స్థానిక సర్పంచ్ తలారి పెంచలమ్మ, ఉప సర్పంచ్ వల్లూరు శకుంతలమ్మ అందజేశారు. అనంతరం ఉప సర్పంచ్ వల్లూరు శకుంతలమ్మ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు జగనన్న విద్యా కానుక ఓ వరం అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కె. ప్రభావతి, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు మొదలగున వారు పాల్గొన్నారు.