నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామ సమీపంలోని కల్లేరు లో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. సోమవారం ఇసుక తరలిస్తున్న ఒక ట్రాక్టర్ ను గమనించిన స్థానికులు వెంటనే స్థానిక సచివాలయంలో సమాచారం ఇవ్వగా వెంకన్నపాలెం సర్పంచ్ తలారి పెంచలమ్మ అక్కడికి చేరుకొని వారిని మందలించారు. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. పై అధికారులు ఈ విషయంలో జోక్యం చేసుకుని ఇసుక దందాలను అరికట్టాలని ఆమె కోరారు.