మనుబోలు మండలం లోని వెంకన్నపాలెం గ్రామంలో అంబేద్కర్ 131వ జయంతి వేడుకను గ్రామంలోని విఏపిఆర్ యూత్ వల్లం శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, మెడబల్లి శ్రీనివాసులు, కోడి వెంకటరమణయ్య, తలారి ప్రవీణ్ కుమార్, వల్లం హరినాథ్, దార్ల వంశీ, పులేరి వెంకటేశ్వర్లు, గోని మల్లికార్జున్, నాగిశెట్టి భాను, వల్లం రవితేజ, వల్లం, నాని, నావూరు బాలరాజు, వల్లం ఫ్రాన్సిస్ మొదలగువారు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వెంకన్నపాలెం వైయస్సార్ సిపి నాయకులు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ తలారి పెంచలమ్మ విచ్చేశారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని అందించారని కొనియాడారు.