ఉపాధి హామీ పని పరిశీలన

1469பார்த்தது
ఉపాధి హామీ పని పరిశీలన
నెల్లూరు జిల్లా మునుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో సోమవారం ఉపాధి హామీ పనిని ఉప సర్పంచ్ అనంత పద్మనాభ రెడ్డి పరిశీలించారు. అందరితో కలిసి పలుగు చేతబట్టి పని చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి జాబ్ కార్డ్ ఉండేలా చేస్తామని ఆయన అన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ పనిచేయాలని సూచించారు. గ్రామంలో ఇప్పటికే సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సహాయ సహకారాలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఇంకా కూడా ఎన్నో జరుగుతాయని ఆయన అన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி