నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామంలో సచివాలయం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉప సర్పంచ్ అనంత పద్మనాభ రెడ్డి మరణం తరువాత ఆగిపోయిన పనులను ఆయన కుమారుడు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి పున: ప్రారంభించారు. తన తండ్రి గారు తలపెట్టిన ప్రతి పనిని నెరవేరుస్తానని ఆయన గ్రామ ప్రజలకు ఈ సందర్భగా హామీ ఇచ్చారు.