జిల్లాలో అక్టోబర్ 25 వ తేదీ నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు పశుగణన జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఒ. ఆనంద్ తెలిపారు. పశుసంవర్ధక శాఖ రూపొందించిన వాల్ పోస్టర్ ను జిల్లా కలెక్టర్ గురువారం ఆవిష్కరించారు. పశు గణన సిబ్బంది నెల్లూరు జిల్లాలోని ప్రతి గడపకు వచ్చి విషయ సేకరణ గావిస్తారనీ మీ ఇంటికి వచ్చే విషయ సేకరణ దారులకు పశువుల సమగ్ర సమాచారం అందించాలని కోరారు.