వెంకన్నపాలెం గ్రామంలో పాడి పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలని వెటర్నరీ జూనియర్ అసిస్టెంట్ సుధాకర్ తెలిపారు. గాలికుంటు వ్యాధి వస్తే పశువుల్లో తీవ్ర జ్వరం, నీరసం, ఎద్దుల్లో పనిసామర్థ్యం తగ్గుతుందన్నారు. వైద్యం నిర్లక్ష్యం చేస్తే పశువులు చనిపోయే అవకాశం ఉందన్నారు. గాలికుంటు వ్యాధి టీకాలు వేయడం వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గకుండా ఉంటుందని, దూడల్లో మరణాలు తగ్గుతాయన్నారు. కనుక గ్రామంలో పాడి పశువుల రైతులు తప్పనిసరిగా తమ జీవాలకు గాలికుంటు వ్యాధి టీకాలు వేయించుకోవాలని అన్నారు.