కావలి లోని అక్కం బావిలో వ్యక్తి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. దీనిపై స్థానికులు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆ బావిలో పడి సుమారు 6 మంది మృతి చెందారన్నారు. బావికి మెస్ వేయడం అనేది ఒక చిన్న పని అది కూడా గత ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఆరు ప్రాణాలు బలయ్యాయన్నారు. మా ఎమ్మెల్యే(కావ్య కృష్ణారెడ్డి) దీనిపై చర్యలు తీసుకుంటారని తెలిపారు.