నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మనుబోలు మండలం లోని వెంకన్నపాలెం ఆదివారం రాత్రి ST కాలనీలోకి నీరు చేరడంతో వైయస్సార్ సిపి నాయకులు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి వాళ్ళని గ్రామంలోని MPP స్కూల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. అప్పటినుండి వెంకన్నపాలెం గ్రామ సర్పంచ్ తలారి పెంచలమ్మ పునరావాస కేంద్రంలో ఉన్న వారికి కి ఆహార సదుపాయాలను అందిస్తుంది. మంగళవారం ఉదయం టిఫిన్ గా ఉప్మా , పొంగలి చేయించి వాళ్లకు వడ్డించరు.