నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యం మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో ఎస్టీ కాలనీలోకి రాత్రి 3 గంటల సమయంలో వరద నీళ్లు ఇళ్లల్లోకి రావడంతో వాలంటీర్ వెంకటరమణయ్య, వెంకన్నపాలెం వైఎస్ఆర్సిపి నాయకులు వల్లూరు హర్షవర్ధన్ రెడ్డి కి తెలియజేశారు. వెంటనే స్పందించిన ఆయన వారిని వెంకన్నపాలెం ఎంపీపీ స్కూల్లో ఉండేలా ఏర్పాటు చేశారు. అనంతరం సర్పంచ్ తలారి పెంచలమ్మ, హర్షవర్ధన్ రెడ్డి యువసేన పునరావాస కేంద్రంలో ఉండేవాళ్ళకి ఆహారం అందించారు.