నెల్లూరు జిల్లా మనుబోలు మండలం లోని వెంకన్న పాలెం గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి సహాయ సహకారాలతో శరవేగంగా జరుగుతున్నాయి. ఒక వైపు సచివాలయం పనులు జరుగుతుంటే మరో వైపు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. వెంకన్నపాలెం ఉప సర్పంచ్ అనంత పద్మనాభ రెడ్డి గత నెల 29వ తేదీన స్వర్గస్తులైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఆయన కుమారుడు వల్లూరు హర్ష వర్ధన్ రెడ్డి తన తండ్రి గ్రామంలో చేస్తానని మాట ఇచ్చిన ప్రతి పనిని తాను దగ్గరుండి చేయిస్తానని ప్రజలకు ఆయన ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లోను వమ్ము కానీఇవ్వనని ఎవరికి ఏ ఆపద వచ్చినా తన తండ్రి లా ప్రజలకు అండగా ఉండి చూసుకుంటనని ఆయన అన్నారు.