జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు ఎమ్మిగనూరు డిఎస్పీ. ఎం. ఉపేంద్ర బాబు ఆధ్వర్యంలో మంగళవారం సిఐ, ఎస్ఐ మరియు 38 మంది సిబ్బంది ఏఎస్సై, పిసిలతో కలిసి అబ్బాస్ టాకీస్ సమీపాన ఉన్న శాంతి నగర్ కాలనీ నందు కార్దన్ సర్చ్ నిర్వహించారు. ముందుగా నాటు సారా, ఎన్డిపిఎల్, కర్ణాటక లిక్కర్, తెలంగాణ లిక్కర్, గంజాయి మరియు మత్తు పదార్థాల కొరకు అనుమానాస్పద వ్యక్తుల ఇళ్ళ వద్ద, అనుమానాస్పద వస్తువులు, వాహనముల మీద సోదాలు చేపట్టారు.