మంత్రాలయం మండలంలోని వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సూచించారు. గురువారం మంత్రాలయంలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రవి పాల్గొన్నారు.