నందవరం మండల పరిధిలోని గురజాల గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు దేవీ నవరాత్రుల ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఆలయంలో మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరదేవీ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు కార్యక్రమ నిర్వాహకుడు జి. రాజేశ్వర రెడ్డి తెలియజేశారు.