ఉపాధి హామీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని రాష్ట్ర ఉపాధి హామీ పథకం సంచాలకులు వై వి కే. షణ్ముఖ కుమార్ ఐఎఫ్ఎస్ గురువారం పేర్కొన్నారు. మహానంది మండలంలో ఉపాధి హామీ పథకం క్రింద చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. అల్లినగరం, గాజులపల్లె, బొల్లవరం గ్రామాల్లో పల్లె పండుగ వారోత్సవాలలో క్రింద మంజూరైన సీసీ రోడ్ల పనులను పరిశీలించారు. ఇంజనీర్ శ్రీనివాస్, ఎపిడి బాలాజి నాయక్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.