గ్రామీణ మహిళల్లో అక్షరాస్యతను పెంచేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని వయోజన విద్య అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రతాప్ పేర్కొన్నారు. మహానంది మండలం బుక్కాపురం గ్రామంలోని వెలుగు కార్యాలయంలో యుఎల్ఎల్ఎస్ ప్రోగ్రాంపై వివోఏలు, వయోజన విద్యా వాలంటీర్లకు అవగాహన గురువారం కల్పించారు. మహిళల్లో అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు.