అధిక వర్షాలతో జరిగిన పంట నష్టం స్వల్పమేనని కర్నూలు జిల్లా వ్యవసాయ శాఖ తేల్చింది. జిల్లాలో కురిసిన వర్షాలకు వ్యవసాయ పంటలు 5, 300 హెక్టార్లలో, ఉద్యాన పంటలు 823 హెక్టార్లలో నీటమునిగినట్లు వ్యవసాయ, ఉద్యాన శాఖలు ప్రాథమికంగా నిర్ధారించాయి. గురువారం జిల్లా కలెక్టర్ ఆమోదంతో ప్రభుత్వానికి, విపత్తుల నిర్వహణ శాఖకు నివేదిక సమర్పించారు. ఇన్ పుట్ సబ్సిడీ రూ. 1. 04 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.