నంద్యాల మండలం బిల్లలాపురం, పెద్దకొట్టాల గ్రామ రైతు సేవా కేంద్రాలను శుక్రవారం మండల వ్యవసాయ అధికారి ప్రసాద రావు సందర్శించారు. వారు మాట్లాడుతూ. ప్రతి రైతు పొలాన్ని ఈ-పంటలో నమోదు చేయాలని, 100 శాతం ఇ-కేవైసీ చేయించాలని గ్రామ వ్యవసాయ సహాయకులను ఆదేశించారు. పంట నమోదు చేపట్టిన రైతులకు మాత్రమే ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలు అందుతాయన్నారు.