కల్లుకుంటాలో ఎస్పీ కారును అడ్డుకున్న నాయకులు
ఎస్పీ బిందు మాధవ్ కల్లుకుంట గ్రామ సందర్శనలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బాధితురాలి ఇంటిని సందర్శించి తిరిగి వళ్తుండగా దళిత సంఘాల నాయకులు ఆయన కారును అడ్డుకున్నారు. బాధితురాలు గోవిందమ్మను కట్టేసిన ఘటన స్థలాన్ని సందర్శించి, స్పష్టమైన హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపు చేయడానికి ప్రయత్నించిన వారు వినలేదు. అనంతరం ఎస్పీ కారుదిగి, అధికారులతో కలసి ఘటన ప్రదేశాన్ని పరిశీలించారు.