పెద్దకడబూరు మండలంలోని ప్రధాన రహదారిలో నీరు నిల్వ ఉండడంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బంది పడ్తున్నారు. ప్రధాన రహదారి వెంబడ ఉన్నటువంటి తాగునీటి పైప్లైన్ లీకేజీతో చిత్తడి చిత్తడిగా మారిపోతుంది. తాగునీరు సరఫరా చేసినప్పుడల్లా రోడ్డు బురదమయంగా అవుతుందని గ్రామపంచాయతీ వారు పట్టించుకోకపోవడంతో ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం అధికారులకు తెలుపుతామని వారు స్పందించకపోతే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.