మంత్రాలయం నియోజకవర్గంలోని మేకడోణ గ్రామంలో అకాల వర్షం కురుస్తున్న కారణంగా ఖరీఫ్ లో వేసిన వేరుశనగ పంట రైతులకు అపార నష్టం కలిగిoచింది. చేతికొచ్చిన పంట పూర్తిగా నష్టపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయాము అని వాపోతున్నారు. దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం వచ్చే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మంగళవారం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.