కౌతాళం మండలం చిరుతపల్లి గ్రామంలో వర్షాలు కురవాలని వరుణ దేవుడిని ప్రార్థిస్తూ ఆదివారం కప్పలకు పెళ్లి చేశారు. ముందుగా గ్రామంలో రోకలిబండకు వేపాకులు కట్టి రోకలికి కట్టిన జోలే లో రెండు కప్పలను ఉంచి ఇంటింటికి తిరుగుతూ పసుపు, కుంకుమ బియ్యం సేకరిస్తూ విరాళంగా వచ్చిన డబ్బులతో గ్రామ దేవత దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేశారు.