శ్రీ నాగుల కట్ట అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద సీనియర్ న్యాయవాది రామచంద్రరావు ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల విగ్రహాలను పంపిణీ చేశారు. ఆలయ అధ్యక్షులు మధు సాయి మాట్లాడుతూ ప్రతి ఏటా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయడానికి ముందుకు వచ్చిన న్యాయవాదికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.