ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 19న కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ యు. పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రూ. 12వేల నుంచి రూ. 21 వేల వరకు జీతం ఉంటుందని, వివరాలకు 8374376305 నంబర్ ను సంప్రదించాలన్నారు.