వ్యవసాయ కూలీలకు ఉపాధి పనులు కల్పించి వలసలను అరికట్టాలని కోడుమూరు ఎంపీడీవో రామడు సిబ్బందిని ఆదేశించారు. బుధవారం కోడుమూరులో ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లతో నిర్వహించిన సమావేశంలో ఎంపీడీవో మాట్లాడారు. మండలంలో 200 రోజులకు సంబంధించి చేపట్టబోయే పనులకు ప్రణాళికలు తయారు చేయాలన్నారు. అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించి కూలీల సంఖ్య పెంచాలని, రైతులను గుర్తించి పండ్ల తోటల సాగుపై అవగాహన కల్పించాలన్నారు.