ఆళ్లగడ్డ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో శుక్రవారం సాయంత్రం డాక్టర్ వెంకటసుబ్బారెడ్డి హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు, సిబ్బందికి వైద్య నిపుణులు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరానికి రోగుల నుండి విశేష స్పందన లభించింది. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు.