ఆదోనిలో ఎస్సీ కాంప్లెక్స్ ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం శనివారం నిర్వహించారు. టౌన్ కన్వీనర్ వన్నాల మణికంఠ అధ్యక్షతన చేపట్టారు. సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి బండారి హనుమంతు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ.. పత్తికొండలో 15న జరిగే ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేసేందుకు ఎమ్మార్పీఎస్ కార్య కర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.