కర్నూలు జిల్లాలోని ఆదోని పట్టణంలో కురిసిన గురువారం భారీ వర్షానికి రైతు బజార్ జలమయమైంది. పట్టణంలో కురిసిన వర్షానికి రైతు బజార్లో వర్షపు నీరు నిలిచి వినియోగదారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు. వర్షం వచ్చిన ప్రతిసారి తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతు బజార్ వినియోగదారులు అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, రైతు బజార్ లో నీరు నిల్వకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు.