ఎమ్మిగనూరు పట్టణంలో ఐదవ రోజు దీక్ష చేస్తున్న బాధితురాలు గోవిందమ్మ, ఆదివారం స్థానిక పోలీసులతో సమావేశమైంది. ఎమ్మిగనూరు టౌన్ సీఐ సుదర్శన్ రెడ్డి, కోసిగి సీఐ మంజునాథ్, మంత్రాలయం సీఐ రామాంజులు,పెద్దకడబూరు ఎస్సై నిరంజన్ రెడ్డి ఆమెను విరమింపచేయాలని కోరారు. కానీ గోవిందమ్మ, నన్ను అవమానపరిచిన నిందితులను అరెస్టు చేసేంతవరకు దీక్ష విరమించబోను అని స్పష్టం చేసింది.