ఆదోనిలో ఎమ్మెల్యే పార్థసారథి విషయంలో మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి నూర్ అహ్మద్, ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ఆదివారం మాట్లాడుతూ, ఎమ్మెల్యే చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమాలు జరుగకూడదని అభిప్రాయపడ్డారు. ప్రాణభయం ఉంటే పోలీసులు రక్షణ అందించగలరని సూచించారు. మీడియాలో వారి వాయిస్ ఇవ్వడం వల్ల స్థానికుల మనోభావాలు దెబ్బతింటాయని అన్నారు. ఎమ్మెల్యే పార్థసారథిపై జరుగుతున్న కుట్రలను తక్షణమే దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.