మరణించిన, గ్రామం వదలివెళ్లిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని, ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ స్పష్టం చేశారు. శనివారం ఆదోని పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను అకస్మికంగా తనిఖీ చేసి, మాట్లాడారు. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు కొత్తగా ఓటరు నమోదుకు ఫారం - 6 భర్తీ చేసి సమర్పించాలని సూచించారు.