ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి. జయనాగేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు, స్థానిక 5వ వార్డులో అమాన్ ఆధ్వర్యంలో వంద రూపాయలతో సభ్యత్వం నమోదు కార్యక్రమం గురువారం నిర్వహించారు. సభ్యత్వం తీసుకుంటే వారికి అన్ని రకాల బీమా వర్తిస్తుందని తెలిపారు. అందువల్ల, ప్రతి ఒక్కరు టిడిపి సభ్యత్వం తీసుకోవాలని కోరారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం లక్ష్యంగా,
టీడీపీ సభ్యత్వం పొందేందుకు ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు.