పెద్దకడబూరు నుంచి కల్లుకుంట గ్రామానికి వెళ్లే రహదారిలో యర్రగుంట వాగు దగ్గర రోడ్డుకు ముళ్ల చెట్లు అడ్డంగా ఏపుగా పెరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ రోడ్డులో ప్రయాణించే వాహనదారులు ఎదురుగా వచ్చే వాహనాలను గుర్తించలేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాపోతున్నారు. సంబంధిత అధికారులు సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని మంగళవారం కోరారు.