మంత్రాలయం: తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి

59பார்த்தது
మంత్రాలయం: తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
దేవనకొండ మండలం కప్పట్రాళ్ల యురేనియం తవ్వకాలపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయ రామిరెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం మంత్రాలయంలో మాట్లాడారు. కొన్ని సామాజిక మాధ్యమాల్లో యురేనియం తవ్వకాలపై ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంత్రాలయం పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

தொடர்புடைய செய்தி