వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు గ్రామీణ ప్రాంతాలు కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోక అద్వాన పరిస్థితికి నెలకొందని, టీడీపీ యువనేత రామకృష్ణ రెడ్డి, రాష్ట్ర రైతు అధికార ప్రతినిధి రమాకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తారపురం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమంలో రూ. 5 లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు రైతులకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులను చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు.