సమాజంలో మార్పు రావాలంటే దానికి విద్యార్ధి దశనే కీలకమని అటువంటి విద్యార్ధి దశలో ఆచార్యులు అన్నీ తామై విద్యార్థులకు అవసరమైన జ్ఞానాన్ని అందించాలని రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి నరవ రమాకాంత్ రెడ్డి అన్నారు. గురువారం తిరుమల తిరుపతి దేవస్థానము, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో పెద్దకడుబూరు ఉన్నత పాఠశాలలోని విద్యార్థులకు ఉచితంగా మానవులందరికీ భగవద్గీత అనే పుస్తకం అందజేశారు.