కర్నూలు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకటశేషాద్రి కర్నూలు మండలం గార్గేయపురంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్లోని సౌకర్యాలు, ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి మాట్లాడారు. సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించి ఏవైనా లోపాలు ఉంటే వాటి మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు.