గూడూరు మండలం పెంచికలపాడు విశ్వభారతి ఆసుపత్రి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. గురువారం తెలంగాణ నుంచి పందులలోడ్ తో మైదుకూరుకు వేగంగా వెళ్తన్న బొలొరో ట్రాలీ ఏపీ39వీసీ9445 వాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టును ఢీకొనడంతో రామయ్య, గుర్రప్ప అనే ఇద్దరు వ్యక్తులు వాహనంలో ఇరుక్కుని మృతి చెందగా, వెంకటప్ప అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.