నంద్యాల జిల్లా, బేతంచెర్ల మండలం నందు ఎక్కువ భాగం మెట్ట ప్రాంతం. మండలంలో అధిక శాతం సాగు పొలాలు కొండలు, గుట్టలు ఉన్నాయి. ఈ మండలంలోని ఖరీఫ్ సీజన్లో దాదాపు 10వేల ఎకరాలలో రైతులు కంది పంటను సాగు చేశారు. ప్రస్తుతం ఈ పంటలను సాగుచేసిన రైతులు సంతోషంతో ఎరువులను, పురుగుమందులను అప్పుచేసి సాగు చేశారు. ఈ తుఫాన్ ప్రభావంతో ఏడతేరిపిలేని వర్షాల వల్ల కంది పూత నేలపాలైందని ఆందోళన చెందుతున్నారు.